'అమెరికా ఫస్ట్‌' అనేదే నా నినాదం: డొనాల్డ్‌ ట్రంప్‌

70చూసినవారు
'అమెరికా ఫస్ట్‌' అనేదే నా నినాదం: డొనాల్డ్‌ ట్రంప్‌
'అమెరికా ఫస్ట్‌' అనేదే తన నినాదమని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. వాషింగ్టన్‌ డీసీలో రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. "అమెరికా అనేక ఆటుపోట్లను, సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని నిలబడింది. దేశ సరిహద్దుల రక్షణ మాకు చాలా కీలకం. శాంతిభద్రత విషయంలో మరింత కఠినంగా ఉండాలి. అమెరికా విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి. అమెరికా పేరు నిలబెట్టేందుకు ప్రజలంతా ముందుకు రావాలి" అని ట్రంప్‌ పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్