ఏపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు పథకంపై కూటమి ప్రభుత్వం దసరా రోజు శుభవార్త చెప్పనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఉచిత బస్సు పథకాన్ని అక్టోబర్ చివరి వారంలో అమలు చేసే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే దీనిపై ప్రభుత్వం క్లారీటీ ఇవ్వాల్సి ఉంది.