జలియన్ వాలాబాగ్ అమరవీరులకు కేంద్ర హెూంమంత్రి అమిత్ షా ఘనంగా నివాళులర్పించారు. ‘జలియన్ వాలాబాగ్ మారణకాండ భారత స్వాతంత్య్ర పోరాటంలో చీకటి అధ్యాయం, ఇది యావత్ దేశాన్ని కుదిపేసింది. అమానుషత్వం పరాకాష్టకు చేరుకున్న బ్రిటిష్ పాలన క్రూరత్వం కారణంగా భారతీయుల్లో రగిలిన ఆగ్రహం, స్వాతంత్య్ర ఉద్యమాన్ని ప్రజల పోరాటంగా మార్చింది’ అని అమిత్ షా అన్నారు. అమరులైన అమరవీరులకు నివాళులు అర్పించారు.