బాల్యంలో సరైన పోషకాహారం అందకపోవడంతో చిన్నారుల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడుతోందని యునిసెఫ్ వెల్లడించింది. ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలను గమనిస్తే 68 శాతం మంది ఈ లోపంతోనే ప్రాణాలు విడిచినట్లు పేర్కొంది. కౌమార దశలోని బాలికలకు సరైన పోషకాలు లేకపోవడంతో రక్తహీనత పెరుగుతోందని వివరించింది. భవిష్యత్తులో మరిన్ని అనారోగ్య సమస్యలకు కారణమవుతోందని పేర్కొంది.