లొంగిపోయిన మావోలపై అమిత్ షా వరాల జల్లు

53చూసినవారు
లొంగిపోయిన మావోలపై అమిత్ షా వరాల జల్లు
లొంగిపోయిన మావోయిస్టులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వరాల జల్లు కురిపించారు. బస్తర్‌లో లొంగిపోయిన మావోయిస్టులకు ప్రతి నెల రూ.15 వేల ఆదాయం కల్పిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. ఆదివారం ఛత్తీస్‌గడ్ పర్యటన సందర్భంగా అమిత్ షా ఈ కీలక ప్రకటన చేశారు. లొంగిపోయిన మావోయిస్టులకు ఇల్లుతో పాటు జీవనోపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం పునరావాసం కల్పించడానికి సాధ్యమైన ప్రతిదాన్ని చేస్తుందని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్