రాష్ట్రపతి భవన్ ఆవరణలోని అమృత ఉద్యానవనాన్ని ఈ నెల 16 నుంచి సెప్టెంబరు 15వ తేదీ వరకు ప్రజల సందర్శనకు తెరిచి ఉంచనున్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు. ఉద్యానవనంలోకి ప్రవేశం ఉచితమని, అయితే సందర్శకులు https://visit.rashtrapatibhavan.gov.in/ వెబ్‌సైట్ ద్వారా ఉచిత టికెట్లు బుక్ చేసుకోవాలని స్పష్టంచేశారు. నేరుగా వచ్చే యాత్రికులు గేట్ నం:35 వద్ద ఏర్పాటుచేసిన కియోస్క్‌ల నుంచి కూడా ఉచిత టికెట్లు తీసుకోవచ్చని చెప్పారు.