రోడ్డు మీదకు వచ్చిన ఏనుగుకు అడ్డుగా నిలిచిన ఓ ఆటో డ్రైవర్ కు వింత అనుభవం ఎదురైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మేరకు రోడ్డుపై ఏనుగు రావడం చూసి కూడా ఓ ఆటో డ్రైవర్ దానికి ఎదురుగా వెళ్లాడు. దాంతో ఆటోపై ఏనుగు దాడికి ప్రయత్నించింది. ఈ క్రమంలో డ్రైవర్ ఆటోను తప్పించాలని చూడగా అదుపుతప్పి కింద పడింది. వెంటనే ఆటో డ్రైవర్ బయటకు వచ్చి పరుగులు తీశాడు. ఇది ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలీదు గానీ.. ఈ వీడియో వైరల్ గా మారింది.