సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైలర్ అవుతోంది. వేగంగా వెళ్తున్న ఓ రైల్లో ఓ వృద్ధుడు విచిత్రంగా ప్రవర్తించాడు. డోరు వద్దకు వెళ్లిన అతడు.. అటూ, ఇటూ ఇనుప రాడ్లు పట్టుకుని కిందకు వేలాడాడు. కింద చివరి మెట్టు వరకూ దిగి ప్రమాదకరంగా వేలాడతాడు. అంతటితో ఆగకుండా మళ్లీ సడన్‌గా పైకి లేస్తాడు. ఆ తర్వాత తలుపు వద్ద రెండు వైపులా కాళ్లు పెట్టి అటూ, ఇటూ తిరుగుతూ విన్యాసాలు చేస్తాడు. ఇలా చాలా సేపు కోతిలా డోరు వద్ద విచిత్రంగా ప్రవర్తిస్తాడు.