రాజస్థాన్‌లోని బికనీర్‌లో జింకలను వేటాడినందుకు పోలీసులు 60 కిలోమీటర్ల దూరం పాటు వెంబడించి వేటగాళ్లను పట్టుకున్నారు. ఆరుగురు వ్యక్తులు అక్కడి స్థానిక అటవీ ప్రాంతంలో ఓ జింకను వేటాడి తమ జీపులో తరలిస్తున్నారు. విషయం తెలుసుకన్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వారిని పట్టుకున్నారు. ఆరుగురిలో ముగ్గురు పంజాబ్‌కు చెందిన వారిగా గుర్తించారు.