దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్‌లో అన్నా హారిస్ చరిత్ర సృష్టించింది. 24 ఏళ్లకే ప్రపంచకప్‌లో అంపైర్‌గా ఆమె బాధ్యతలు నిర్వర్తించింది. కార్డిఫ్ యూనివర్సిటీలో ఈ ఇంగ్లాండ్ అంపైర్ మెడిసిన్ చదువుతోంది. ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య 2021 సెప్టెంబరులో ఆమె ఫీల్డ్ అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించింది. అప్పటికి ఆమె వయసు కేవలం 22 ఏళ్లు. చిన్న వయసులోనే అంపైర్‌గా ఎంపికై, ఆకట్టుకుంటోంది.