ఆమ్‌ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. 2019లో ద్వారకలో భారీ హోర్డింగ్‌లు ఏర్పాటుచేయడానికి ప్రజానిధులు దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఢిల్లీ రౌజ్‌అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇందులోభాగంగా ఢిల్లీ పోలీసులు కేజ్రీవాల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ జరుగుతోందని, మరింత సమయం కావాలని కోర్టును అభ్యర్థించారు. దీంతో తదుపరి విచారణను కోర్టు వచ్చే నెల 18కి వాయిదా వేసింది.