యూట్యూబర్ హర్షసాయిపై నమోదైన అత్యాచారం కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. అతడు దేశం వదిలి వెళ్లకుండా చూడాలని బాధితురాలు సైబరాబాద్ సీపీని కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో హర్షసాయిపై పోలీసులు లుక్ అవుట్ నోటీసు జారీచేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపైనా చర్యలు తీసుకోవాలని బాధితురాలు సీపీని కోరారు.