జమ్మూ కశ్మీర్‌లో మరోసారి శనివారం ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కుప్వారా జిల్లాలో నియంత్ర రేఖ వెంబడి పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ జరిపిన దాడిని భారత సైన్యం భగ్నం చేసింది. ఈ క్రమంలో అక్కడ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నా యి ఈ ఘటనలో ఓ సైనికు డు మరణించగా.. ఆర్మీ మేజర్ సహా నలుగురు గాయపడ్డారు. దాదాపు 3 గంటల పాటు ఇరువైపులా కాల్పులు కొనసాగాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.