తెలంగాణలో గత పదేండ్లలో చేయలేని పనులు.. ఒక్క ఏడాదిలో చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి నియోజవర్గంలో రూ.1,000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. రూ.6 కోట్ల 45 లక్షలతో పెద్దపల్లిలో కొత్త మున్సిపల్ కార్యాలయ భవనం, రూ.101 కోట్లతో గుంజగడపలో ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం, రూ.23 కోట్లతో సింగరేణి ద్వారా రామగుండంలో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.