మహారాష్ట్రలోని నాగ్‌పూర్ గోరెవాడ రెస్క్యూ సెంటర్‌లో మూడు పులులు, ఒక చిరుతపులి మరణించాయి. అయితే ఇవి బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఫ్లూ H5N1 వైరస్) సోకడంతో మరణించినట్టు అధికారులు తెలిపారు. డిసెంబర్ 2024 చివరలో ఇవి మరణించినట్టు వెల్లడించారు. దీంతో మహారాష్ట్ర అంతటా అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. ఇదే కేంద్రంలోని 26 చిరుతలు, 12 పులులకు అధికారులు పరీక్షలు నిర్వహించగా, ఇవన్నీ ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించారు.