ఉజ్వల భవిష్యత్తు కోసం బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ఢిల్లీ ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. దేశ రాజధానిని అభివృద్ధి చేయగలిగే పార్టీ ఒక్క బీజేపీయేనని అన్నారు. రోహిణిలో ఆదివారంనాడు జరిగిన 'బీజేపీ పరివర్తన యాత్ర' లో ఆయన మాట్లాడుతూ, మనం 2025 సంవత్సరంలో ఉన్నామని, 21వ శతాబ్దంలో 25 ఏళ్లు గడిచిపోయాయని, శతాబ్దంలో పావు సంవత్సరం ముసిగిపోయిందని అన్నారు. ఢిల్లీ భవిష్యత్తుకు చాలా కీలకమని చెప్పారు.