టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకుంటున్నారంటూ కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాహల్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరలవుతోంది. ఇందులో మద్యం మత్తులో తూగుతోన్న చాహల్‌ను ఒక వ్యక్తి పబ్ నుంచి బయటకు తీసుకొస్తున్నట్లు ఉంది. అయితే ఈ వీడియో ఇప్పటిది కాదని తెలుస్తోంది. చాహల్- ధనశ్రీ విడాకుల వార్తల నేపథ్యంలో కొందరు పాత వీడియోను వైరల్ చేస్తున్నారని సమాచారం.