మరో అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్న అశ్విన్

70చూసినవారు
మరో అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్న అశ్విన్
భారత స్పిన్‌ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో వరుసగా మూడు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ సైకిళ్లలో 50+ వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా నిలిచాడు. WTC 2019-21 సీజన్‌లో 14 మ్యాచుల్లో 71 వికెట్లు, 2021-23 సీజన్‌లో 61, 2023-25 సీజన్‌లో ఇప్పటి వరకు 50 వికెట్లు పడగొట్టాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్