మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లోకి మరో జట్టు చేరనున్నట్లు తెలుస్తోంది. వచ్చే సీజన్‌లో తమకు అవకాశం కల్పించాలని చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ శ్రీనివాసన్ కుమార్తె రూపా గురునాథ్ బీసీసీఐని అభ్యర్థించినట్లు సమాచారం. కాగా డబ్ల్యూపీఎల్‌లో ప్రస్తుతం ఐదు జట్లు ఉన్నాయి. యూపీ వారియర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు కొనసాగుతున్నాయి.