అమెరికాలోని లాస్ వెగాస్ కోర్టులో ఓ కేసులో వాదనలు వింటున్న మహిళా జడ్జిపై నిందితుడు దాడి చేశారు. ఈ ఘటన జనవరిలో జరగగా, తాజాగా నిందితునికి 65 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. డియోబ్రా రెడెన్ అనే వ్యక్తి ఓ కేసులో అరెస్టయ్యాడు. ఆ కేసులో వాదనలు వింటున్న జడ్జి మేరీ కే హోల్థస్‌పై నిందితుడు దాడి చేశాడు. కోర్టు సిబ్బంది ఆ దాడిని అడ్డుకున్నారు. అప్పటి ఆ దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.