పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు చెందిన మరో నేతపై కాల్పులు జరిగాయి. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని నోడఖాలిలో ఈ సంఘటన జరిగింది. శనివారం మధ్యాహ్నం బైక్‌పై వెళ్తున్న స్థానిక టీఎంసీ నేత కృష్ణపాద మండల్‌పై కొందరు వ్యక్తులు దగ్గర నుంచి కాల్పులు జరిపి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన ఆయనను కోల్‌కతాలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉంది.