ఆన్లైన్ బెట్టింగ్ బారిన పడి ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి చెందిన బీటెక్ విద్యార్థి నిఖిల్ ఆన్లైన్ గేమ్స్ ఆడి అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడ్డాడు. మొదటిసారి అప్పులపాలైతే తండ్రి డబ్బులు ఇచ్చి అప్పులు తీర్చినట్లు తెలుస్తోంది. తీరు మార్చుకోకుండా మళ్లీ ఆడిన నిఖిల్.. భారీగా నష్టపోవడంతో వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది.