డీలిమిటేషన్‌పై ప్రధానికి జగన్ లేఖ

85చూసినవారు
డీలిమిటేషన్‌పై ప్రధానికి జగన్ లేఖ
AP: డీలిమిటేషన్ ప్రక్రియపై ప్రధాని మోదీకి వైసీపీ అధినేత జగన్ శనివారం లేఖ రాశారు. లోక్‌సభ, రాజ్యసభలో ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా చూడాలని లేఖలో పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గకుండా చూడాలన్నారు. 2026లో జరిగే డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన ఉందని, ఎంపీ సీట్లు తగ్గుతాయనే ఆందోళనలో దక్షిణాది నేతలు ఉన్నారన్నారు. కాగా ఇవాళ తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరుగుతోంది.

సంబంధిత పోస్ట్