శోభిత ధూళిపాళ, అక్కినేని నాగచైతన్యకు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 'వోగ్' మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం నాగచైతన్య భార్య శోభిత ధరించిన డ్రెస్ నెట్టింట వైరల్‌గా మారింది. ఆ డ్రెస్ గతంలో సమంత ధరించిన డ్రెస్‌ని పోలి ఉంది. దీంతో నెటిజన్లు శోభిత.. సమంత స్టైల్‌ని కాపీ చేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్ అయితే, 'మీరు సమంత దుస్తులను కూడా కాపీ చేసారు' అంటూ వారిద్దరినీ టాగ్ చేశారు.