అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ.. దళిత సంఘాల ఆందోళన (వీడియో)

83చూసినవారు
AP: తూ.గో. జిల్లా నల్లజర్ల మండలం గాంధీ కాలనీలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పుల దండ వేశారు. దాంతో నిందితులను కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల నేతలు రోడ్డుపై బైఠాయించారు. చెప్పుల దండ వేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరమణ ఘటనా స్థలానికి చేరుకుని వారికి మద్దతు తెలిపారు. నిందితుల కోసం పోలీసులు డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు.

సంబంధిత పోస్ట్