అవినీతి ఆరోపణలు ఉంటే భవిష్యత్ తరాలకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కట్

81చూసినవారు
అవినీతి ఆరోపణలు ఉంటే భవిష్యత్ తరాలకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కట్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక కీలక ప్రకటన చేశారు. "యూపీలో ఎవరికైనా అవినీతి ఆరోపణలు ఉంటే, వారి భవిష్యత్ తరాలకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు రానివ్వం" అని తెలిపారు. అవినీతిని నిర్మూలించడం, ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత పెంపొందించడం దీని ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు. అవినీతి చేయాలనే ఆలోచన లేకుండా తరతరాలు భయపడే విధంగా చర్యలు ఉంటాయని సీఎం అన్నారు. ఈ ప్రకటనపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సంబంధిత పోస్ట్