తమిళనాడులో పరుగు సినిమాలో దృశ్యం రిపీట్ అయింది. కన్న కూతురు ప్రేమించిన యువకుడితో వెళ్లిపోతుంటే వెళ్ళొదని తండ్రి ప్రాధేయ పడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ జంటకు కూతురు తండ్రి చేతులెత్తి నమస్కరిస్తూ, కాళ్లు మొక్కుతూ వేడుకుంటున్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది. అయితే.. ఇది స్క్రిప్ట్ లా ఉందని కొందరు అంటుంటే, నిజమేనని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.