AP: ప్రకాశం జిల్లా సింగరాయకొండ పరిధిలోని పాకాల బీచ్‌లో ప్రమాదవశాత్తూ అలల తాకిడికి ఐదుగురు గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు మృతి చెందారు. ఒకరిని స్థానిక మత్స్యకారులు కాపాడారు. మరొకరి ఆచూకీ కోసం మెరైన్ పోలీసులు సముద్రంలో గాలిస్తున్నారు. మృతులు పొన్నలూరు మండలం తిమ్మపాలెంకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు.