అవయవ దానంపై మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

62చూసినవారు
అవయవ దానంపై మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
అవయవదానంపై ఏపీ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది. బ్రెయిన్ డెడ్‌తో మరణించి అవయవదానంతో పలువురికి జీవదాతలుగా నిలిచిన వారి పార్థివ దేహాల‌కు గౌరవప్రదమైన వీడ్కోలు తెల‌పాల‌ని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అవ‌య‌వ దాత‌ల కుటుంబాల‌కు రూ.10,000 పారితోషికం పూలు, శాలువా, ప్రశంసా ప‌త్రాల‌కు అద‌నంగా మరో రూ.1000 ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. జిల్లా క‌లెక్టర్ లేదా సీనియ‌ర్ అధికారి అంతిమ సంస్కారంలో పాల్గొనాలని ఆదేశించింది.

సంబంధిత పోస్ట్