తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ శుభవార్త చెప్పింది. బ్యాంకింగ్, ఫైనాన్స్ ఉద్యోగాల శిక్షణకు దరఖాస్తులకు ఆహ్వానం పలికింది. ఈనెల 15 నుంచి ఏప్రిల్ 8 వరకు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ చేపట్టనుంది. 26 ఏళ్లలోపు బీసీ గ్రాడ్యుయేట్లు శిక్షణకు అర్హులు. ఏప్రిల్ 12న జరిగే ఆన్‌లైన్ పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక చేయనున్నారు. నెలరోజుల శిక్షణ తర్వాత ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగాలు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.