ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో ఆదివారం ఉదయం ఆయన ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో ప్రత్యేక వైద్య బృందం ఆయనకు యాంజియోగ్రామ్ నిర్వహించి చికిత్స అందించింది. చికిత్స తర్వాత ఆరోగ్యం నిలకడగా ఉండడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.