చత్తీస్‌గఢ్‌లోని బలోద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న ట్రక్కును ఓ మోటార్ సైకిల్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మైనర్ సహా ముగ్గురు యువకులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.