దేశంలో అత్యన్నత పురస్కారాలైన పద్మ అవార్డులకు కేంద్రం దరఖాస్తులు ఆహ్వానించింది. 2026 గణతంత్ర వేడుకల సందర్భంగా ప్రకటించే అవార్డుల కోసం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపింది. వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులు జులై 31వ తేదీలోపు రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ https://awards.gov.inలో సిఫార్సులు లేదా తమ పేర్లు అప్‌లోడ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.