TG: మార్పింగ్ వీడియోతో 10వ తరగతి బాలికను బ్లాక్ మెయిల్ చేసి వేధించిన ఘటన హైదరాబాద్ గచ్చిబౌలి PS పరిధిలో చోటుచేసుకున్నది. బాలికకు అదే తరగతిలో చదువుతున్న ఓ బాలుడు స్నేహితుడయ్యాడు. మార్ఫింగ్ చేసిన వీడియోతో సదరు స్నేహితుడు యువతిని బ్లాక్ మెయిల్ చేయడంతో ఇద్దరు ప్రైవేటుగా కలుసుకున్నారు. ఈ సమయంలో మరో బాలుడు వీడియో తీశాడు. ఈ వీడియోతో బాలికను ముగ్గురు బ్లాక్ మెయిల్ చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు మైనర్లను అరెస్టు చేశారు.