నేటి నుంచి అరకు 'చలి' ఉత్సవాలు ప్రారంభం

65చూసినవారు
నేటి నుంచి అరకు 'చలి' ఉత్సవాలు ప్రారంభం
AP: ఆంధ్రా ఊటీ అరకులోయలో.. ‘అరకు చలి ఉత్సవ్‌’ నేటి (శుక్రవారం) నుంచి ప్రారంభం కానుంది. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల కోసం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలను అధికారులు ముస్తాబు చేశారు. సాయంత్ర వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, హెలికాప్టర్ రైడ్, హాట్ ఎయిర్ బెలూన్ మోటార్ గ్లైడింగ్ ప్రత్యేక ఆకర్షణలుగా నిలవనున్నాయి. పర్యాటకం పెంపుదలే లక్ష్యంగా వీటిని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్