భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్(58) ఇటీవల మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లారు. ఈమె తొలిసారి 2006 డిసెంబర్ నుంచి 2007 జూన్ మధ్యకాలంలో అంతరిక్షయాత్రకు వెళ్లారు. రెండోసారి 2012లో నాలుగు నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో సునీత రీసెర్చ్ చేశారు. కాగా, కల్పనాచావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారత సంతతి మహిళగా సునీతా విలియమ్స్ రికార్డు సృష్టించారు.