గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం విజయవాడలోని ఏపీ రాజ్‌భవన్‌లో ‘ఎట్ హోం’ కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తేనీటి విందు ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, హైకోర్టు న్యాయమూర్తులు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, నారా లోకేశ్, నారాయణ, అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ తదితరులు హాజరయ్యారు.