HCUలో టెన్షన్ వాతావరణం

70చూసినవారు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. రోహిత్ వేముల సూసైడ్ తో నాటి వీసీ అప్పారావుకు సంబంధం లేదని, రోహిత్ ఎస్సీ కాదని గచ్చిబౌలి పోలీసులు హైకోర్టుకు నివేదిక సమర్పించడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు భారీగా తరలిరావడంతో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అదనపు పోలీసు బలగాలు యూనివర్సిటీ వద్దకు చేరుకున్నాయి.

సంబంధిత పోస్ట్