దారుణం.. నడిరోడ్డుపై జర్నలిస్ట్‌ను కాల్చి చంపిన దుండగులు

72చూసినవారు
దారుణం.. నడిరోడ్డుపై జర్నలిస్ట్‌ను కాల్చి చంపిన దుండగులు
ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన జరిగింది. శనివారం దుండగులు ఓ జర్నలిస్ట్‌ను అతి కిరాతకంగా చంపారు. సీతాపూర్‌లోని లక్నో, ఢిల్లీ హైవేపై రాఘవేంద్ర బాజ్‌పాయ్(35) బైక్‌పై వెళ్తుండగా దుండగులు అతడిని మరో వాహనంతో ఢీకొట్టి గన్‌తో కాల్చారు. యాక్సిడెంట్‌ జరిగిందని సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని హాస్పిటల్‌కు తరలించారు. అయితే బుల్లెట్ గాయాలు చూసి హత్యగా కేసు నమోదు చేశారు. మృతుడు ఆర్టీఐ కార్యకర్త అని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్