వరంగల్ ప్రభుత్వ గెస్ట్ హౌజుల్లో కొండా మురళి దారుణాలు చేశారని BRS నేత RS ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి సురేఖ భర్త మురళి వరంగల్‌లో ఎంతో మంది అమ్మాయిలు, విద్యార్థుల మీద అఘాయిత్యాలు చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేశాడని ఆరోపించారు. మీ ఫామ్‌హౌస్‌లో గోడలే ఇందుకు సాక్ష్యమని చెప్పారు. 2002లో ఆయన ఘోరాలు భరించలేక నళిన్ ప్రభాకర్ అనే పోలీస్ ఆఫీసర్ హన్మకొండ చౌరస్తాలో బహిరంగంగా కౌన్సిలింగ్ ఇచ్చాడని చెప్పారు.