బిహార్ రైల్వే స్టేషన్‌లో దారుణం జరిగింది. తండ్రీకూతురిని ఓ వ్యక్తి రైల్వే ప్లాట్‌ఫాంపై దారుణంగా హతమర్చాడు. పోలీసుల వివరాల ప్రకారం.. తండ్రి అనిల్ సిన్హా, తన కూతురు ఆరాతో కలిసి రైల్వే స్టేషన్‌కు వచ్చారు. ఢిల్లీ వెళ్లేందుకు 3 ప్లాట్‌ఫామ్‌ల మధ్య ఉండగా.. భోజ్‌పూర్‌కు చెందిన అమన్ కుమార్ అనే యువకుడు తుపాకితో వారిద్ధరినీ కాల్చి చంపాడు. కాగా అమన్ కూడా అదే తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.