AP: పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ క్రైస్తవ మత ప్రభోదకుడు కేఏ పాల్‌ను ప్రవీణ్ భౌతిక దేహాన్ని చూసేందుకు మార్చరీ వద్దకు వెళ్లారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రవీణ్ మృతిపై విచారం వ్యక్తం చేశారు. దీంతో అక్కడకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో చేరుకున్నారు. ఈ క్రమంలో మార్చరీ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.