వాల్‌నట్స్ తింటే ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వాల్‌నట్స్‌లో ఫైబర్, విటమిన్ ఇ, ఫోలేట్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గుండెపోటు నివారణ, టైప్ 2 డయాబెటిస్ నిర్వహణలో సహాయపడతాయి. అయితే, గుండె జబ్బు ఉన్నవారు రోజుకు 2-4 ముక్కలు మాత్రమే తినాలని సిఫార్సు చేస్తున్నారు.