దారుణం: ప్రసవం చేసిన శానిటేషన్‌ వర్కర్‌.. శిశువు మృతి

50చూసినవారు
దారుణం: ప్రసవం చేసిన శానిటేషన్‌ వర్కర్‌.. శిశువు మృతి
మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆసుపత్రిలో సరైన సమయానికి వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఓ శానిటేషన్‌ వర్కర్‌ గర్భిణికి ప్రసవం చేసింది. దీంతో పుట్టిన నిమిషాల వ్యవధిలోనే పసి బిడ్డ ప్రాణాలు కోల్పోయింది. వైద్యులు, సిబ్బంది సెలవుల్లో ఉండడంతో ఈ పని చేసినట్లు శానిటేషన్‌ వర్కర్‌ తెలిపారు. కాన్పు తర్వాతే బిడ్డ మృతి చెందినట్లు ఆమె అంగీకరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్