తెలుగు హీరో విశ్వక్ సేన్ తాజాగా నటిస్తోన్న మూవీ 'లైలా'. ఈ మూవీలో విశ్వక్ అమ్మాయి గెటప్‌లో కనిపించనున్నారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించగా.. ఓ రిపోర్టర్ ఆసక్తికర ప్రశ్నలు అడిగాడు. లైలా గెటప్ కేపీహెచ్‌బీ ఆంటీలా ఉందని సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని అన్నారు. దీనికి విశ్వక్ స్పందిస్తూ.. ఇంటర్నేషనల్ బ్యూటీని తీసుకొచ్చి కేపీహెచ్‌బీలో పెడుతావా? కేపీహెచ్‌బీ దగ్గర దొరకదని సమాధానమిచ్చారు.