ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి! (వీడియో)

79చూసినవారు
మహారాష్ట్రలోని భండారా జిల్లాలో ఓ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద సమయంలో ఆ ఫ్యాక్టరీలో 12 మంది ఉన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరిని కాపాడారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్