మటన్ కత్తితో మామ, బావమరిదిపై దాడి

71చూసినవారు
మటన్ కత్తితో మామ, బావమరిదిపై దాడి
ఓ వ్యక్తి మటన్ కట్ చేసే కత్తితో మామ, బావమరిదిపై దాడి చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో అబ్దుల్లా అనే వ్యక్తి తన మామ, బావమరిదిపై మటన్ కట్ చేసే కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. కోపోద్రిక్తులైన స్థానికులు అబ్దుల్లాను చితకబాదారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్