పేర్ని నానిపై ఫిర్యాదు

78చూసినవారు
పేర్ని నానిపై ఫిర్యాదు
మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎంకే మీనాకు, డీజీపీకి ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ ఫిర్యాదు చేశారు. కౌంటింగ్ అంశంపై ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేసేలా మాజీ మంత్రి పేర్ని నాని మీడియాను ఉద్దేశించి మాట్లాడారన్నారు. కౌంటింగ్‌లో పాల్గొని ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులను బెదిరిస్తున్నారన్నారు. దీనిపై ఎన్నికల సంఘం దృష్టి సారించి ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సుబ్బరాయన్ విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్