AP: చాక్లెట్ ఆశ చూపి బాలికను అపహరించేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తికి గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన పల్నాడు జిల్లా వినుకొండలో చోటు చేసుకుంది. ఇసుకవాగు ప్రాంతం వద్ద ఆడుకుంటున్న ఓ బాలికకు చాక్లెట్ ఇచ్చి కిడ్నాప్ చేసేందుకు ఓ యువకుడు ప్రయత్నించాడు. స్థానికులు గమనించి అతడికి దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆ బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.