TG: కుమార్తెతో గొడవ పెట్టుకున్నాడని అల్లుడిపై అత్త, మామ పెట్రోల్ పోసి నిప్పంటించారు. భద్రాద్రి కొత్తగూడెం(D) పాల్వంచ(M) దంతెలబోరకు చెందిన గౌతమ్(24) రామచంద్రునిపేటకు చెందిన కావ్యతో 3 ఏళ్ల క్రితం పెళ్లెంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇటీవల భర్తతో గొడవ కావడంతో ఆమె పుట్టింటికెళ్లింది. భార్యను తీసుకెళ్లేందుకు ఈనెల 2న వెళ్లిన గౌతమ్‌కు ఆమె కుటుంబ సభ్యులతో గొడవైంది. కోపంతో అత్త, మామ పెట్రోల్ పోసి నిప్పంటించగా, చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయారు.